ఓటు హక్కుపై అవగాహన- ఓటర్లను చైతన్యపరిచేలా 'స్వీప్' కార్యక్రమాలు - Vote Awareness Campaign - VOTE AWARENESS CAMPAIGN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 3:30 PM IST
SVEEP Vote Awareness Campaign in Prakasam District : ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రజలలో చైతన్యం కలిగిందుకు ప్రకాశం జిల్లా యంత్రాంగం స్వీప్ ( SVEEP- Systematic Voters Education And Electoral Participation Program) కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు సమీపంలోని ఎస్ఎస్ఎన్ త్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో (SSN Triple IT Engineering College) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,500 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ హాజరయ్యారు.
Joint Collector Gopalakrishna : ఇంజినీరింగ్ విద్యార్థులకు ఓటు అవగాహన కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు, ఓటు సంతకాల సేకరణ లాంటి కార్యక్రమాలను నిర్వహించి చైతన్య పరిచారు. ఇందుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్యంలో ఓటు విలువను జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ విద్యార్థులకు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు చైతన్యం కల్పించేందుకు పలుచోట్ల స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.