గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై తీవ్ర వేధింపులు- రిటైర్డ్‌ హైకోర్టు జడ్జితో కమిషన్‌ వేయాలి: సూర్యనారాయణ - Suryanarayana on YSRCP Govt - SURYANARAYANA ON YSRCP GOVT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 7:52 PM IST

Suryanarayana Demanded an inquiry Into Anarchies of YSRCP Govt: వైఎస్సార్​సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాలపై ఉద్యోగులు ఇచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రిటైర్డ్‌ హైకోర్టు జడ్జ్‌తో కమిషన్‌ వేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ (AP Govt Employees Association leader Suryanarayana) ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమిక ఆధారాలు వాస్తవమని తేలితే బాద్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్థికశాఖ, ఉద్యోగుల సమస్యల్ని ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తరఫున పోరాడుతున్నందుకు అణిచివేయాలని చూశారని మండిపడ్డారు. ఏ కేసు పెట్టారో చెప్పకుండా విచారణకు పిలిచేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌లు ఇంతలా దిగజారడం ఎప్పుడూ చూడలేదని సూర్యనారాయణ అన్నారు. విచారణ పేరుతో నా కుటుంబాన్ని కూడా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కుటుంబాన్ని వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేధింపులపై జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్‌ను నియమించాలని సూర్యనారాయణ కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.