వివాహ శుభలేఖపై టీడీపీ సూపర్-6 పథకాలు - అభిమానం చాటుకున్న కుటుంబం - Super Six Schemes on Wedding Card - SUPER SIX SCHEMES ON WEDDING CARD
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 8:09 AM IST
Super Six Schemes on Wedding Card: ఆ కుటుంబీకులు తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని శుభలేఖల ద్వారా మరింతగా స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను బంధువులు, స్నేహితులకు ప్రచారం చేయాలన్న ఆలోచనతో శుభలేఖలపై వాటిని ముద్రించి తమ అభిమానం చాటుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణనాయుడు వలస గ్రామంలో బాసాన శంకర్రావు అన్నపూర్ణముల కుమారుడు కృష్ణారావు వివాహము జరిగింది. ఆ కుటుంబీకులకు తెలుగుదేశం పార్టీ అంటే ఎనలేని అభిమానం.
ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను తమ కుమారుడి వివాహ శుభలేఖపై ముద్రించి అభిమానాన్ని చాటుకున్నారు. వివాహానికి బొబ్బిలి నియోజకవర్గ అభ్యర్థి బేబీ నాయన హాజరై దంపతులు కృష్ణారావు, హిమబిందులను ఆశీర్వదించారు. పెళ్లి కార్డుపై చంద్రబాబు నాయుడు చిత్రంతోపాటు ఆరు పథకాల వల్ల కలిగే ప్రయోజనం వివరిస్తూ ఇరువైపులా బొబ్బిలి పార్వతీపురం నియోజకవర్గ అభ్యర్థులు బేబీ నాయన, విజయ్ చంద్రల చిత్రాలను ముద్రించి తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆ పెళ్లి కార్డు ప్రస్తుతం వాట్సాప్లో వైరల్ అవుతోంది.