అరసవల్లిలో అద్భుతం - మూలవిరాట్ పాదాలను తాకిన సూర్యకిరణాలు - Sun Rays on Suryanarayana Swamy - SUN RAYS ON SURYANARAYANA SWAMY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2024, 12:41 PM IST
Sun Rays Touches Suryanarayana Swamy Idol at Arasavalli Srikakulam District : శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామి వారిని తాకడంతో భక్తులు పులకించిపోయారు. ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తోంది. దక్షిణాయనం, ఉత్తరాయణ మార్పుల్లో సూర్యోదయం వేళ 3 నుంచి 9 నిమిషాల పాటు సూర్యకిరణాలు స్పర్శించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. వాతావరణంలో మార్పుల వల్ల చాలా కాలం తర్వాత స్వామివారిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని వీక్షించి స్వామివారిని ఆరాధించారు. ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. స్వామి వారి సేవలో తరించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ ప్రాంగణమంతా దైవ నామ స్మరణతో మార్మోగింది.