ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి లోకేశ్​ - Students Request in Prajadarbar - STUDENTS REQUEST IN PRAJADARBAR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 4:25 PM IST

Students Requested Extension of Group 2 Classes for Another 3 Months in Prajadarbar :  ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో 13వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల ప్రజలు మంత్రిని కలిసి సమస్యలు నివేదించారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో నిర్వహిస్తున్న గ్రూప్-2 మెయిన్స్ శిక్షణా తరగతులను మరో మూడు నెలలు పొడిగించాలని విద్యార్థులు కోరారు. గత ప్రభుత్వం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష తప్పుల తడకగా ఉండటంతో తీవ్రంగా నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్న గ్రూప్-2 మెయిన్స్ శిక్షణా తరగతులను పొడిగించాలని విద్యార్థులు కోరారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులతో వివిధ ప్రాంతాల ప్రజలు విజ్ఞాపనలు అందచేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.