'మాకు టీచర్ కావాలి' - ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యార్థుల ధర్నా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 7, 2024, 8:14 PM IST
Students Protest For Teachers Recruitment: పాఠశాలలో రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని గార్లదిన్నె గ్రామంలో ఎమ్మిగనూరు-గూడూరు ప్రధాన రహదారి (Emmiganoor- Gudur Main Road)పై బైఠాయించి ధర్నా చేశారు. మాకు టీచర్ కావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. గార్లదిన్నె గ్రామంలోని ప్రాథమిక పాఠశాల (Primary school)లో 90 మంది విద్యార్థులు చదువుతున్నారు.
Shortage of Teachers in AP Govt Schools: పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు కొన్ని నెలలు క్రితం పదోన్నతి ద్వారా బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల కొరత కారణంగా చదువు కొనసాగడం లేదని రాయలసీమ యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (Rayalaseema United Students Federation) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులు చేపట్టిన ధర్నా కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించి రాష్ట్ర విద్యారంగాన్ని అధమ స్థాయికి దిగజార్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.