మంత్రి బొత్స ఇంటి ముట్టడికి యత్నం- దగా డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ కావాలంటూ ఆందోళన - డీఎస్సీ అభ్యర్థుల నిరసన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 4:43 PM IST
Student Unions Protest at Minister Botsa House: మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు చేస్తున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు మంత్రుల ఇళ్లను విద్యార్ధి సంఘాలు ముట్టడించాయి. తాజాగా డీఎస్సీ పోస్టులు పెంచాలంటూ విద్యార్థి సంఘాలు పోరాటాన్ని ఉద్ధృతం చేశాయి. దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ కావాలి అంటూ విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
కాంగ్రెస్ నాయకులతో పాటు ర్యాలీగా వెళ్తున్న డీఎస్సీ అభ్యర్ధులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. కోట కూడలిలో భారీగా మోహరించిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ నాయకులతోపాటు అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. భారీగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జగన్ మాట తప్పారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయకుంటే జగన్‌ను గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.