తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - Sri Padmavati Ammavaru - SRI PADMAVATI AMMAVARU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 14, 2024, 2:08 PM IST
Sri Padmavati Ammavari Koil Alwar Thirumanjanam in Tiruchanur : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అధికారులు ఈ నెల 22 నుంచి అమ్మవారి వసంత ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆనవాయితీ ప్రకారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని నీటితో శుద్ధి చేశారు.
నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ లాంటి సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయంలో చల్లారు. కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా కల్యాణ ఉత్సవం, సహస్ర దీప అలంకార సేవలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారి వసంత ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.