ఈ ఏడాది పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం : వాతావరణ శాఖ సంచాలకురాలు - IMD Officer On weather report - IMD OFFICER ON WEATHER REPORT
🎬 Watch Now: Feature Video
Published : May 16, 2024, 5:34 PM IST
IMD Officer Nagaratna Interview With Etv Bharat : రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటికబురు ప్రకటించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన ఐదారు రోజులకు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ఈ ఏడాది పలు జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు.
రాగల 5 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం సంభవించే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేసింది. మధ్య, ఈశాన్య, దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షాపాతం ఉత్తర, వాయువ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్న సంచాలకులు నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.