ఆస్తి పంపకాల్లో వివాదం- తల్లిపై దాడి చేశాడని కుమారుడి దాడిలో తండ్రి మృతి - Son killed his father

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 4:51 PM IST

Son killed his father due to a family dispute in Nellore district: భార్యాభర్తలిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై గ్రామ పెద్దలతో పలుమార్లు పంచాయితీ జరిపించారు. అయినా వారిలో మార్పు రాలేేదు. ఎప్పటిలాగే  భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో వెంకటరమణమ్మపై ఆమె భర్త ప్రసాద్ గడ్డపారతో దాడి చేశాడు. ఈ దాడిలో  వెంకటరమణమ్మకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న వెంకటరమణమ్మ పెద్ద కుమారుడు తండ్రిని అడ్డుకునే ప్రయత్నంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. మహేష్ తన తండ్రి ప్రసాద్​పై గడ్డపారతో దాడిచేశాడు. తీవ్ర గాయాలైన ప్రసాద్​ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

ఇదీ జరిగింది: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డెవిస్ పేటలో ప్రసాద్ , అతని భార్య వెంకటరమణమ్మ మధ్య గత కొంతకాలంగా ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య తలపై భర్త ప్రసాద్ గడ్డపారతో దాడి చేశారు. వీరి పెద్ద కుమారుడు మహేష్ తండ్రిని అడ్డుకొని అదే గడ్డపారతో దాడి చేశాడు. ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్, అతడి భార్యను స్థానిక అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రసాద్ మృతి చెందాడు. ప్రసాద్ దాడిలో గాయపడిన భార్య వెంకటరమణమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.