మానవత్వం చాటుతున్న స్వచ్ఛంద సంస్థలు- వరద ప్రాంతాల్లో మూగజీవాలకు ఆహారం - voluntary provided food to animals - VOLUNTARY PROVIDED FOOD TO ANIMALS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 9, 2024, 5:46 PM IST
Some Charitable Organizations Feed to Animals in Vijayawada : విజయవాడలో సంభవించిన వరదలకు మనుషులతో పాటు అనేక మూగజీవాలు ఆహారం లేక అల్లాడిపోయాయి. పశువులు, కుక్కలు సహా మూగజీవాలకు పలు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. బ్రీతింగ్, అనిమల్ వారియర్స్ వంటి సంస్థల ప్రతినిధులు మూగజీవాల ఆకలిని తీరుస్తున్నారు. కుక్కలు, ఆవులు, పిల్లులు వంటి మూగజీవాలకు ఆహారం అందిస్తూ మంచి మనస్సు చాటుకుంటున్నారు. వరదల్లో చిక్కుకున్న సుమారు 700 మూగజీవాలను రక్షించామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు మాట్లాడుతూ "వరదలకు వారం రోజులుగా అనేక ముగజీవులు ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం చేయాల్సిన సాయం చేసింది. అయిన విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని మూగజీవుల ఆకలి తీర్చాల్సి ఉంది. దీంతో పలు రకాల స్వచ్ఛంగా సంస్థల వాలంటీర్లంతా ఏకమై వీధుల్లో కనిపించిన జీవులకు ఆకలి తీరుస్తున్నాం. అవసరమైతే వాటికి చికిత్స అందిస్తున్నాం. కొన్నిచోట్ల ఇప్పటికి వరద నీరు తగ్గలేదు. ఎన్డీఆర్ఎఫ్ సాయంతో సేవలను మరింత ఎక్కువగా చేస్తున్నాం. ప్రభుత్వం మూగజీవులపై దృష్టి పెట్టి వాటిని రక్షించాలి" అని పేర్కొన్నారు.