ఎరక్కపోయి మింగింది - ఇరుక్కుపోయింది - snake swallowed frog - SNAKE SWALLOWED FROG
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 5:27 PM IST
Snake Swallowed Frog: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత కొద్ది నెలల నుంచి ఎక్కడ చూసినా పాములు ప్రత్యక్షమవుతున్నాయి. ఇళ్లు, వంటింట్లోను పశువుల పాకల వద్ద ఇలా పలు ప్రదేశాలలో నాగుపాములు తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజుల ముందే నివాస గృహాల మధ్య భారీ త్రాచుపాము బుసలు కొడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. తాజాగా కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రెడ్డివారిపాలెంలో రెడ్డి బాలాజీ అనే వ్యక్తి నివాసంలో పామును చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
ఇంటి ప్రహరీ గోడ పరిసరాల్లో తిరుగుతున్న పెద్ద కప్పను పాము మింగింది. పాము వేగంగా కదలలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన ఇంటి సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్కు ఫోన్ చేశారు. దీంతో అక్కడకు చేరుకుని పామును కొంతసేపు ఆడిస్తూ పాము కడుపులో ఉన్న కప్ప బయటకు వచ్చేటట్లు స్నేక్ క్యాచర్ చేశాడు. అనంతరం దాన్ని డబ్బాలో బంధించాడు. ఆ తర్వాత పామును సురక్షిత ప్రాంతంలో వదిలారు. దీంతో చాకచక్యంగా తాచుపామును బంధించి సురక్షిత ప్రాంతంలో వదలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక యువకులు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.