పల్నాడు జిల్లాలో వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్టు - జింక చర్మం కొమ్ములు స్వాధీనం - జింకలను వేటాడే వ్యక్తులు అరెస్టు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-02-2024/640-480-20842309-thumbnail-16x9-smugglers-arrested-in-narasaraopet-division.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 1:38 PM IST
Smugglers Arrested in Narasaraopet Division: జింకలను వేటాడి వాటి చర్మం, కొమ్ములను ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్న ముఠాను పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అటవీ శాఖ అధికారుల వివరాల ప్రకారం, నరసరావుపేట డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జింకలను వేటాడి వాటి చర్మం, కొమ్ములను బెంగుళూరు తరలించి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బొల్లాపల్లికి చెందిన నలుగురు వ్యక్తుల్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి నుంచి జింక చర్మం, 21 జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. వీరు మాత్రమే కాకుండా మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.
పక్కా సమాచారం ప్రకారమే ఈ దాడులు నిర్వహించమని అధికారులు వివరించారు. అటవీ శాఖ ప్రాంతాల్లో సంచరించే వన్యప్రాణులను చంపినా, వాటి చర్మం, ఇతరాలను వినియోగించి, పలు రకాల ఆకృతులను తయారు చేసినా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇతన డిజైన్లు తయారు చేసి ఇళ్లల్లో అలంకరణ వస్తువులు తయారు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.