ఏరో స్పేస్ రంగంలో అమ్మాయిలకు శిక్షణ - కల్పనా ఫెలోషిప్ ద్వారా ఇంటర్న్‌షిప్
🎬 Watch Now: Feature Video
Skyroot Co Founder Bharat Interview : ఆకాశం అంచులు తాకాలి అంతరిక్ష రహస్యాలు తెలుసుకోవాలి ఇలాంటి ఆశలు, ఆకాంక్షలు అమ్మాయిలకు ఉన్నా ఏరో స్పేస్ రంగంలోకి అడుగుపెట్టే వారి సంఖ్య చాలా తక్కువ. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంతరిక్షంలో భారత్ సాధిస్తున్న విజయాల దృష్ట్యా ఈ వైపు అడుగులు వేయడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికి అవకాశాలున్నా ఆర్థిక ఇబ్బందులు, అసమానతలు వెంటాడుతుంటాయి. మరి కొందరికి స్పేస్ ఫీల్ట్ వైపు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై అవగాహన లేకపోవడం మరోక కారణం.
Skyroot Aerospace Kalpana Fellowship : అలాంటి మహిళలకు అంతరిక్ష రంగంలో చోటు కల్పించడానికి స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సిద్ధమైంది. కల్పనా ఫెలోషిప్ పేరుతో ఇంటర్న్‌షిప్ నిర్వహిస్తుంది. బీటెక్, ఎస్టెక్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులని పేర్కొంది. మరి, దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? శిక్షణ విధానం ఎలా ఉంటుంది? తదితర అంశాలను స్కైరూట్ కో ఫౌండర్ భరత్ మాటలలోనే తెలుసుకుందాం.