సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల ట్రయల్​ రన్​ సక్సెస్ - త్వరలోనే ప్రారంభం - Sitarama Project Trial Run - SITARAMA PROJECT TRIAL RUN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 10:30 PM IST

Sitarama Lift Irrigation Project Trial Run Success : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వేప కొయ్య రామవరం సమీపంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ట్రయల్​ రన్​ను అధికారులు గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఎత్తిపోతల పథకంలో ఆరు విద్యుత్​ మోటార్లను ఏర్పాటు చేశారు. వాటి నిర్మాణ పనులు పూర్తికావడంతో ఒక మోటారు పని తీరును ట్రయల్​ రన్​ ద్వారా పరీక్షించారు. 1500 క్యూసెక్కుల నీరును ఒక్కొక్క మోటారు ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పది నిమిషాల పాటు నిర్వహించిన ట్రయల్​ రన్​ సందర్భంగా మోటారు ఎత్తిపోసిన నీటిని సమీపంలోని పాములేరు వాగులోకి వదిలారు. ట్రయల్​ రన్​ విజయవంతం కావడంతో అధికారులు కేరింతలు కొట్టారు. త్వరలోనే అధికారికంగా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఖమ్మం జిల్లాలోని సాగుకు నిరంతరం నీటి లభ్యత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన పనులను చకచకా చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.