దేవాలయాల్లో తొలిసారిగా విద్యుత్‌ బస్సును ప్రారంభించిన సింహాచలం దేవస్థానం - Simhachalam Devasthanam - SIMHACHALAM DEVASTHANAM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 7:52 PM IST

Simhachalam Devasthanam Started Electric Bus: తెలుగు రాష్ట్రాల దేవాలయాల్లో తొలిసారిగా సింహాచలం దేవస్థానం విద్యుత్ బస్సును ప్రవేశపెట్టింది. ఈ బస్సును దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు (Pusapati Ashok Gajapathi Raju) ప్రారంభించారు. విద్యుత్ బస్సుల ద్వారా నిర్వహణ భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రారంభించామని ఆయన తెలిపారు. గోశాల ఆవరణంలోని సౌర విద్యుత్ కేంద్రం (Solar power station) ద్వారా దేవస్థానం ఏటా 12 లక్షల యూనిట్ల విద్యుత్​ను వినియోగిస్తోందని తెలిపారు. మిగులు రెండు లక్షల యూనిట్ల ద్వారా ఈ బస్సులను నడుపుతామని వెల్లడించారు. రెండున్నర గంటలపాటు ఛార్జింగ్ పెడితే ఈ బస్సు 226 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ఆలయ ఈవో సింగం శ్రీనివాస మూర్తి (EO Singam Srinivasa Murthy) తెలిపారు. 18 లక్షల వ్యయంతో శాస్త్ర ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో మరో బస్సు అందుబాటులోకి వస్తుందని అన్నారు. బస్సు ప్రారంభించిన అనంతరం అందులో ప్రయాణించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.