వైసీపీ సిద్ధం సభ నుంచి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం - వైసీపీ కార్యకర్త మృతి - Bus Accident in Medaramatla

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 10:04 PM IST

Siddham Sabha Bus Accident in Bapatla District : బాపట్ల జిల్లాలో జరిగిన వైసీపీ సిద్ధం సభ అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కార్యకర్త మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని అద్దంకి మండలం గోపాలపురం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు మేదరమెట్లలో ఏర్పాటు చేసిన వైసీపీ సిద్ధం సభకు నరసరావుపేటకు చెందిన బాలదుర్గారావు అనే వ్యక్తి వెళ్లారు. సభ ముగిసిన అనంతరం తిరిగి బస్సులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో బాలదర్గారావు మృతి చెందారు. 

ప్రైవేటు స్కూల్‌ బస్సులో డోర్ వద్ద కూర్చుని ఉండగా ఒక్కసారిగా అదుపుతప్పి బస్సు నుంచి బాలదర్గారావు కిందపడిపోయాడు. వెంటనే బస్సు వెనుక చక్రాలు అతని తలపై నుంచి పోవడంతో దుర్గారావు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలిలో మృతుని బంధువులు బోరున విలపించారు. విషయం తెలిసిన నాన్‌హైవే సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మృతిడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్​కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.