వరంగల్ జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు - దహీ హండి వీడియో చూశారా? - DAHI HANDI IN NARSAMPET - DAHI HANDI IN NARSAMPET

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 1:44 PM IST

Shrikrishna Janmashtami celebrations: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శివాజీ నగర్ కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శివాజీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. నర్సంపేట్ టౌన్​లోని నాలుగు దారుల కూడలిలో 30 అడుగుల ఎత్తు ఉన్న స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దానికి గ్రీస్ రాసి అడుగు భాగంలో బంక మట్టిని పోశారు. ఆ స్తంభంపైన ఒక ఉట్టిని అమర్చి దానిలో నగదు పారితోషికాన్ని పెట్టారు.

ఉట్టిని కొట్టే ఆటలో ఒక్కొక్క జట్టుకు ఐదుగురు సభ్యులు చొప్పున ఏర్పాటయ్యారు. ఉట్టిని కొట్టేందుకు స్తంభం ఎక్కుతూ ఉంటే కొంత మంది యువకులు వారిపై నీళ్లు చిమ్మతుండడంతో జారి కింద పడిపోతూ, మళ్లీ ఎక్కుతూ ఆటలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇచ్చిన సమయంలో ఏ జట్టు సభ్యులు ఉట్టిని కొట్టకపోవడంతో మళ్లీ సమయం పెంచి ఆడించారు. ఈ సాహసోపేతమైన ఉట్టిని కొట్టే ఆటలో కేటాయించిన సమయంలో శివాజీ టీమ్‌ సభ్యులు ఉట్టిని తాకి నగదు పారితోషకాన్ని అందుకున్నారు. ఈ వేడుకలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.