అంగరంగ వైభవంగా షిర్డీ సాయిబాబా పల్లకి సేవ - 20 ఏళ్ల కోరికను నెరవేర్చుకున్న భక్తురాలు - Shri Saibaba temple
🎬 Watch Now: Feature Video
Shri Saibaba Temple in Maharashtra : మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్టీలో సాయిబాబా పల్లకీ సేవ అంగరంగ వైభంగా జరిగింది. వేద వాయిద్యాలు, సన్నాయి మేళాల మధ్య భక్తులు నృత్యలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ ఆలయంలో ప్రతి గురువారం, పండుగ సమయాల్లో బాబా పల్లకీ సేవ చేయటం ఆచారంగా వస్తుంది. అయితే ఈ పవిత్రమైన పల్లకిని బాబా సంస్థాన్ ఉద్యోగులు మాత్రమే మోస్తుడటం ఏళ్ల తరబడి వస్తున్న ఆనవాయితీ. కానీ చెన్నైకి చెందిన భానుమతి అనే సాయి భక్తురాలు బాబా పల్లకిీని మోయాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. ఈమె గత 20 సంవత్సరాలుగా బాబాను దర్శించుకుంటోంది. అయితే ఎప్పటిలాగే ఈరోజు షిర్టీ క్షేత్రనికి వచ్చిన ఈమె ఎలాగైన తన కోరికను నెరవేర్చుకోవాలని పూనుకుంది.
దీంతో షిర్డీ సాయిబాబా సంస్థాన్ మాజీ ధర్మకర్త సచిన్ తాంబేని సంప్రదించి తన కోరికను వ్యక్తం చేసింది. ఆమె అచంచలమైన భక్తిని చూసి బాబా పల్లకీని మోయడానికి వారు అనుమతించారు. దీంతో వేదవాయిద్యాలు, భక్తుల కోలాహాల మధ్య భానుమతి సాయిబాబా పల్లకిని భుజాన వేసుకుని ద్వారకామాయి మందిరం నుంచి చావడి వరకు తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న కోరిక ఈరోజు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. చనిపోయేలోగా ఈ కోరిక తీరుతుంది లేదా? అని నిత్యం మదనపడేదాన్ని. చివరికి బాబా దాయతో తన కోరిక తీరిందని భానుమతి పొంగిపోయింది.