'పదోన్నతుల్లో మాకు అన్యాయం జరిగింది - న్యాయం చేయండి' - SGT Teachers protest in Telangana - SGT TEACHERS PROTEST IN TELANGANA
🎬 Watch Now: Feature Video
Published : Jun 17, 2024, 2:54 PM IST
SGT Teachers Protest in Jangaon : ఉపాధ్యాయ పదోన్నతుల్లో ఎస్జీటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జనగామ జిల్లాలో టీచర్లు నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆందోళనకు దిగారు. 30 సంవత్సరాలు సర్వీసులో ఉన్నా ఒక్క పదోన్నతి కూడా నోచుకోకుండా రిటైర్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Teachers Protest For promotion in Telangana : ఎస్జీటీ టీచర్స్‌కు ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ పదోన్నతుల్లో అర్హత ఉన్న పండిట్, పీఈటీలుగా పీహెచ్ఎంఓ పోస్టులలో అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలకు స్వచ్చందంగా రాజీనామా చేసి జనగామ ఆర్టీసీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 వేల ఎస్జీటీలకు అన్యాయం జరుగుతుందని, ఉపాధ్యాయ సంఘాలు ప్రజా ప్రతినిధులకు ఎంతగా మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదని అన్నారు. చేసేదేం లేక అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించుకున్నామని తెలిపారు.