కడప జిల్లాలో ఇప్పటి వరకు రూ.23 కోట్ల సొత్తు స్వాధీనం- 15 వేల మందిపై బైండోవర్ కేసులు : ఎస్పీ - Seizures in YSR District - SEIZURES IN YSR DISTRICT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 10:47 PM IST
Seizures in YSR District: వైఎస్ఆర్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. డిసెంబరు నుంచి జిల్లాలో అక్రమ మద్యం, నగదు రవాణాపై దృష్టి పెట్టామని వివరించారు. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 12 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశామని ఎస్పీ వెల్లడించారు. అదే విధంగా 17 కిలోల బంగారము, 47 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
నగదు బంగార ఆభరణాలు విలువ మొత్తం 23 కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన తెలియజేశారు. జిల్లాలో అల్లర్లు చేస్తారని అనుమానం ఉన్న 15 వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని దాదాపు 3 వేల లీటర్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 208 మందిని అరెస్టు చేశామని తెలిపారు. నేరాలకు సంబంధించి వివిధ సీఆర్పీసీ చట్టాలకు సంబంధించి సాంకేతికంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఎలక్షన్ మిత్ర పేరుతో ప్రత్యేక వెబ్సైట్, యాప్ను అందుబాటులోకి తెచ్చిందని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలియజేశారు.