ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లికి సీఎం రాక - ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం : మంత్రి సీతక్క - Seethakka latest news
🎬 Watch Now: Feature Video
Published : Feb 1, 2024, 10:37 PM IST
Seethakka Visit In Adilabad : రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నమని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మంత్రి, ఎమ్మెల్యేలు వెండి బొజ్జ, ప్రేమ్ సాగర్ రావులతో కలిసి పర్యటించారు. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న సందర్భంగా అక్కడ సభా ప్రాంగణాలతో పాటు హెలిప్యాడ్ నాగోబా ఆలయ ప్రాంతాన్ని పరిశీలించి సభలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు.
Revanth Reddy Visit Nagobha Temple : ఫిబ్రవరి 2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని సీతక్క తెలిపారు. రానున్న పార్లమెంటు ఎలక్షన్ సందర్భంగా ఈ జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తామని మంత్రి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి కోరారు. అదిలాబాద్ జిల్లాతో రేవంత్ రెడ్డికి అనుబంధం ఉందని ఆమె తెలిపారు. ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఏర్పాటు చేసిన సభకు, రాష్ట్ర నాయకులతో పాటు, ప్రజలందరూ సహకరించి సభను విజయవంతం చేయాలని సీతక్క కోరారు.