LIVE : సికింద్రాబాద్ టు విశాఖ రెండో వందేభారత్ రైలు ప్రారంభోత్సవం - Second Vande Bharat Express Launch
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 12, 2024, 9:28 AM IST
|Updated : Mar 12, 2024, 10:04 AM IST
Second Vande Bharat Express Launch Live : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు నడవనుంది. కేవలం గురువారం మాత్రమే ఈ వందేభారత్ రైలు నడవదు. మిగిలిన అన్ని రోజులు ప్రయాణిస్తుంది. ఈ రైలు సాధారణ సేవలు వైజాగ్-సికింద్రాబాద్ వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ల బుకింగ్స్ మార్చి 12 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ వందేభారత్ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగనుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఏడు ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు, ఒక ఎగ్బిగ్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లతో ప్రయాణిస్తుంది. అన్ని బోగీలలో కలిపి మొత్తం 530 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. అదే విధంగా గుంటూరు డివిజన్ పరిధిలో రైల్వే ప్రాజెక్టులను సైతం వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు.
Last Updated : Mar 12, 2024, 10:04 AM IST