అదుపు తప్పి స్కూల్ వ్యాన్ బోల్తా - తప్పిన పెను ప్రమాదం - school van overturned
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 10:43 PM IST
School Van Overturned in Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ మినీ వ్యాన్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. జిల్లాలోని పుట్టపర్తి మండలం పెడబల్లిలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం పాఠశాల ముగిశాక 20 మంది విద్యార్థులను స్కూల్ వ్యాన్‌లో ఎక్కించుకొని డ్రైవర్ బత్తలపల్లికి బయలు దేరాడు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్తూ, మరోక ఆటోను తప్పించే సమయంలో అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి సహాయక చర్యలు చేపట్టాడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన విద్యార్థులను పుట్టపర్తి సత్యసాయి ఆసుపత్రికి తరలించారు.
పరిమితికి మించి వాహనంలో విద్యార్థులను ఎక్కించుకొని వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరగడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో డ్రైవర్‌పై స్థానికులు, తల్లిదండ్రులు మండిపడ్డారు.