అదుపుతప్పి స్కూల్ బస్సు బోల్తా - చిన్నారి మృతి - School Bus Overturn Obulavaripalli - SCHOOL BUS OVERTURN OBULAVARIPALLI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 9:33 AM IST
|Updated : Aug 12, 2024, 11:47 AM IST
School Bus Accident in Obulavaripalli : నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మనం బాగానే వాహనం నడుపుతున్నా ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేస్తున్నా కొన్నిసార్లు ఇతరులు చేసినా తప్పులకూ ఎందరో అమాయకులు బలవుతున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
Road Accident in Annamayya District : తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఓబులవారిపల్లె నుంచి శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాల బస్సు విద్యార్థులను ఎక్కించుకొని బయల్దేరింది. కొద్ది దూరం వెళ్లాక బస్సు రోడ్డు పక్కన ఉన్న రాయిని ఎక్కి ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులో డోర్ పక్కనే ఉన్న విద్యార్థిని భవిష్య(8) అక్కడికక్కడే మృతి చెందిందని రైల్వే కోడూరు సీఐ బాబు తెలిపారు. వాహనం స్టీరింగ్ రాడ్డు విరగడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ పేర్కొన్నారు. మరోవైపు చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.