'దిల్లీ లిక్కర్​ స్కాం కంటే ఏపీలో జరిగిందే ఎక్కువ- జగన్ జైలుకెళ్లకుండా తప్పించుకోలేరు' - MLA Somireddy Fires on Jagan - MLA SOMIREDDY FIRES ON JAGAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 5:11 PM IST

MLA Somireddy Chandramohan Reddy Fires on Jagan : ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్​మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా అది పూర్తి కాలేదని జగన్ బాధపడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఇలా తీర్పు ఇచ్చారని ఆయన మదనపడతున్నారని, లేదంటే ఏపీని పూర్తిగా నాశనం చేసేవారని అన్నారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్​ను అరాచకాలకు, అప్పులకు, దుర్మార్గాలకు నెలవుగా మార్చారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆక్షేపించారు.

అన్నపూర్ణ లాంటి రాష్ట్రానికి ఈ పరిస్థితి పట్టిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో ఏపీని కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారని తెలిపారు. మరోవైపు దిల్లీ లిక్కర్ స్కాం కంటే ఆంధ్రప్రదేశ్​ భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్​మోహన్ రెడ్డి​ కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఇక ఆయన జైలుకెళ్లకుండా తప్పించుకోలేరని సోమిరెడ్డి చంద్రమోహన్​ రెడ్డి వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.