తమిళనాడులో బోల్తాపడిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు- 25 మంది ప్రయాణికుల గాయాలపాలు - కుప్పం బస్సు తమిళనాడులో బోల్తా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 10:30 PM IST
RTC Bus Overturned Due to Lost Control in Tamilnadu: డిపోకే పరిమితం కావాల్సిన బస్సులకు పైపైన రంగులతో మెరుగులు దిద్ది పరుగులు పెట్టిస్తున్నారు. ప్రయాణం భద్రంగా ఉంటుందనే భరోసాతో బస్సెక్కిన ప్రయాణికులను ప్రమాదాల బారిన పడేస్తున్నారు. సగానికి పైగా బస్సులు కాలం చెల్లినా పట్టించుకోవడం లేదు. బస్సులు కొనడానికి నిధులివ్వమంటే సీఎం జగన్ ఉలకరు పలకరు. నాలుగున్నర ఏళ్లుగా కొత్త బస్సుల కోసం ఎదురుచూపులే. ఛార్జీల పెంపు, రాబడిలో ప్రభుత్వ వాటా వసూలు చేసుకోవడంలో ఉన్న శ్రద్ద ప్రయాణికుల భద్రతపై లేదు. ఫలితంగా ఓ వైపు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైసీపీ సర్కారు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
చిత్తూరు జిల్లా కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తమిళనాడులో బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కుప్పం నుంచి 45 మంది ప్రయాణికులతో తమిళనాడులోని బరుగూరుకు ఆర్టీసీ బస్సు బయల్దేరింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కనుమూరు వద్ద అటవీ ప్రాంతంలో బోల్తా పడింది. స్టీరింగ్ రాడ్ విరగడం వల్లే అదుపు తప్పినట్లు బస్సు డ్రైవర్ చెబుతున్నారు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాలం చెల్లిన బస్సులు నడపడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.