ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం - సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ - road accident in Eluru district - ROAD ACCIDENT IN ELURU DISTRICT
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 20, 2024, 4:10 PM IST
Scenes of Road Accident in Eluru District Recorded on CC Camera : ఏలూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మిపురం సమీపంలోని రహదారి మలుపు వద్ద ఓ ప్రైవేట్ బస్సుకు ఎదురుగా ఆటో, లారీ వేగంగా వచ్చాయి. ఆ సమయంలో చిన్న పాటి వర్షం పడుతున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ గమనించకుండా మలుపు వద్ద వేగంగా వెళ్లారు. కొన్ని అడుగులు దూరంలోనే ఆటో, లారీ ఉన్నాయని గమనించిన డ్రైవర్ చాకచాక్యంగా వ్యవహించి అక్కడ ఉన్న ఆటోను తప్పించి, పక్కన ఉన్న లారీని ఢీకొట్టాడు.
దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమయంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ లారీని కాకుండా ఆటోను ఢీకొట్టి ఉంటే పెనూ ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. లక్ష్మీపురం జాతీయ రహదారిపై మలుపు వద్ద ప్రైవేట్ బస్సుకు ఆటో, లారీ వేగంగా వచ్చిన దృశ్యాలు, బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించిన దృశ్యాలన్నీ బస్సులోని సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ రోడ్డు ప్రమాద ఘటన దశ్యాలు సామాజికి మాధ్యమాల్లో వైరల్గా మారాయి.