అలలు పోయి మిగిలిన శిలలు - ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడి - RK Beach Sea Water
🎬 Watch Now: Feature Video
RK Beach Sea Water Receded in Visakha District : ఇసుక తిన్నెలపై ఎగిరి, చల్లగాలులు ఆస్వాదిస్తూ, సాగర జలాల్లో ఆడాలని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు చాలా మంది వెళ్తుంటారు. కానీ తీరా వెళ్లాక చూస్తే అక్కడ సాగర తీరంలో సముద్రం వెనక్కి జరిగింది. ఆర్క్ బీచ్ ప్రాంతంలో ఉన్న రాళ్లు బయటపడడంతో సందర్శకులు వాటిపైకి ఎక్కి సాగర ఘోషను ఆస్వాదిస్తున్నారు.
RK Beach : సాధారణంగా అప్పుడప్పుడు ఆటుపోటుల కారణంగా సముద్రం ముందుకు రావడం, వెనక్కి వెళ్లడం జరుగుతుంది. సముద్రం వెనక్కి వెళ్లినపుడు మాత్రమే రాళ్లు పైకి తేలి దర్శనమిస్తాయి. గత రెండు రోజుల క్రితం సముద్రం సుమారు 400 మీటర్లు దాకా వెనక్కి వెళ్లడంతో విశాఖ బీచ్‌కు వచ్చే సందర్శకులు వాటిపై ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు. రాళ్లు నాచు పట్టిఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జీవీఎంసీ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. సందర్శకులు సాగర కదలికలు గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.