భూబాధితుల సమస్యలు పరిష్కరిస్తాం - సెప్టెంబరు 1 నుంచి రెవెన్యూ సదస్సులు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి - Revenue Seminars From September 1

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 3:32 PM IST

thumbnail
సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు- బాధితులంతా తరలిరావాలి: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి (ETV Bharat)

Minister Ram Prasad Reddy In Praja Darbar At NTR Bhavan : సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు భూ బాధితులంతా తరలిరావాలని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖలో ఆన్‌లైన్‌ ట్యాంపరింగ్‌, రికార్డ్స్‌ తారుమారుపై గ్రామ స్థాయిలో బాధితుల నుంచి అధికారులు పిర్యాదులు తీసుకొని పరిష్కరిస్తారని చెప్పారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్​ భవన్‌లో ప్రజా దర్బార్‌ నిర్వహించిన మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మంత్రికి బాధితులు సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కరిస్తామని రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. 

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. భూ బాధితులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేెందుకు ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ సదస్సుల గ్రామ సభల్లో క్రింది స్థాయి అధికారుల నుంచి కలెక్టర్​ వరకు పాల్గొంటారని స్పష్టం చేశారు. గ్రీవెన్స్​లో వచ్చే సమస్యల్లో చాలా వరకు పరిష్కారం చూపుతున్నామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.