ETV Bharat / state

ఏలేరు వరద ధాటికి పంట భూముల్లో ఇసుక మేటలు - దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు - Sand Dunes in Crop Felds Kakinada

Sand Dunes in Crop Felds in Kakinada : ఇసుక మేటలు ఆపై కొట్టుకొచ్చిన రాళ్లు పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలను నిలువునా దెబ్బతీశాయి. కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో ఇటీవల ఏలేరు వరదల ధాటికి పంటలన్నీ కకావికలమయ్యాయి. వరదలు తగ్గిన తర్వాత బయటపడుతున్న పొలాల్ని చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. పంట భూములు సాగుకు పనిరాకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

Sand Dunes in Crop Felds in Kakinada
Sand Dunes in Crop Felds in Kakinada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 7:06 AM IST

Updated : Sep 17, 2024, 8:32 AM IST

Yeleru Floods Victims Problmes : ఏలేరు అతి భారీ వరదలతో విరుచుకుపడి ఊళ్లను, పంట పొలాలను ముంచేసిన తీరు చూసి రైతులు కంటతడిపెడుతున్నారు. జలాశయానికి 5.72 టీఎంసీల వరద ఇన్​ఫ్లో రాగా నాలుగున్నర టీఎంసీల నీరు దిగువకు వదిలారు. రికార్డు వరద ఆయకట్టు పరిధిలోని 7 మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఏళేశ్వరం, కిర్లంపూడి, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో 60,000లకు పైగా వరి, ఇతర పంటల్ని ముంచేసింది. పలు చోట్ల కాల్వలకు గండ్లు పడి ఏపుగా పెరిగిన వరి పంట నీట మునిగింది.

పెట్టుబడి అంతా వరదపాలైందని ఆవేదన : వరద తగ్గిన తర్వాత పంట పొలాలకు కలిగిన నష్టం చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. ఇసుక మేటలు పేరుకుపోవడంతో వాటిని ఎలా తొలగించాలో తెలియక సతమతమవుతున్నారు. కిర్లంపూడి మండలంలోనే అత్యధికంగా గండ్లు పడ్డాయి. భీకర ప్రవాహాలు మరిన్ని జనావాసాల్ని ముంచెత్తకుండా 22 చోట్ల గండి కొట్టారు. తాజాగా 100 ఎకరాలకు పైగా ఇసుక మేటలు పొలాల్లో వేశాయి. పెద్ద పెద్ద రాళ్లు, తుప్పలు, డొంకలు కొట్టుకొచ్చి సారవంతమైన భూముల్లో మేట వేశాయి.

"పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాం. వేల ఎకరాల్లో ఇసుక మేటలు, రాళ్లు రప్పలతో కప్పేశాయి. ఇక సాగు చేసే పరిస్థితి లేదు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు పెట్టుబడంతా వరద పాలైంది. కౌలు రైతులకు పరిహారం ప్రకటించలేదు. ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. ఎకరానికి పది వేలు ఇస్తామన్నారు. ఇసుక మేటలు పేరుకుపోవడంతో వాటిని ఎలా తొలగించాలో అర్ధం కావడం లేదు. ప్రభుత్వమే మమల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం." - బాధిత రైతులు

Crop Damage in Yeleru Floods : రాజుపాలెం, ముక్కొల్లు, భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, బూరుగుపూడి, సోమరాణియంపేట, గోనాడ గ్రామాల్లోని పొలాల్లో అడుగడుగునా ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. పిఠాపురం మండలం రాపర్తి, రాయవరంతోపాటు గొల్లప్రోలు, పెద్దాపురం మండలాల్లోని కాల్వలకు గండి పడ్డ చోట పొలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాల్వలకు పడ్డ గండి పూడ్చేందుకు కిర్లంపూడి మండలం ముక్కొల్లులో రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాల్వల్లో నీటి ఉద్ధృతి కారణంగా అన్నదాతలకు సాధ్యపడటం లేదు.

ఏలేరు ఆయకట్టు పరిధిలో 60,000ల ఎకరాల్లో వరి, ఇతర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు ఎకరానికి రూ.10,000ల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఇందులో అత్యధికంగా కౌలు రైతులే ఉన్నారు. ఇప్పటికే శిస్తుతోపాటు ఎకరానికి రూ.20,000లకు పైగా పెట్టుబడి పెట్టామని అంటున్నారు. ప్రభుత్వం అందించే సాయం తమకు ఇవ్వాలని కౌలు రైతులు కోరుతున్నారు.

విజయనగరం జిల్లాలో వరదలు - వందల ఎకరాల్లో పంటలు నేలమట్టం - Crop Damage in Vizianagaram

కోనసీమ లంక గ్రామాలను ముంచేసిన గోదావరి - డ్రోన్ విజువల్స్ - Flood Affect in Mummidivaram

Last Updated : Sep 17, 2024, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.