అధికారుల వేధింపులు, వైఎస్సార్సీపీ నేతల దౌర్జన్యం - నిండు ప్రాణం బలి - వ్యవసాయ సహాయకురాలుఆత్మహత్య
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 5:46 PM IST
RBK Agriculture Assistant Suicide in Bapatla District : బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో రైతు భరోసా కేంద్రంలో పని చేస్తున్న వ్యవసాయ సహాయకురాలు పూజిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. తడిసిన ఎరువుల బస్తాలకు సంబంధించిన నగదును చెల్లించాలని అధికారులు ఒత్తిడి తెచ్చారు. అదేవిధంగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు డబ్బులు ఇవ్వకుండా ఎరువుల బస్తాలు తీసుకెళ్లారు. దీంతో ఆ భారమంతా వ్యవసాయ సహాయకురాలి మీద పడింది.
RBK Employee Suicide in Bapatla District : దీంతో ఆమె వైసీపీ నాయకుడు తీసుకున్న బస్తాలకు గానూ రూ 40 వేల రూపాయల బకాయిలు చెల్లించాలని అధికారులు పూజితను ఆదేశించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజిత విధులు నిర్వహించే (RBK) రైతు భరోసా కేెంద్రంలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. టార్గెట్లు పెడుతూ అధికారులు వేధిస్తున్నారని, తమ చేత వ్యాపారం చేయిస్తున్నారని ఆర్బీకే ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆవేదన వెలిబుచ్చారు. పూజిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.