రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో దివంగత రామోజీరావుకు ఘన నివాళులు - Ramadevi School Tribute to Ramoji - RAMADEVI SCHOOL TRIBUTE TO RAMOJI

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 2:31 PM IST

Ramadevi Public School Tribute to Ramoji Rao : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. పాఠశాల పునః ప్రారంభమైన తొలిరోజున రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.  

Teachers and Students Tribute to Ramoji Rao : పాఠశాల ఆవరణలో సంగీత ఉపాధ్యాయుడు సింహ రచించి స్వర కల్పన చేసిన 'మహాప్రస్థానం మరో ప్రపంచ నిర్మాణం మీతోనే మీతోనే' అనే గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా దివంగత రామోజీ రావు 'రామోజీ' గ్రూప్​ సంస్థల ద్వారా వివిధ రంగాల్లో చేసిన అపార సేవలను రమాదేవి పాఠశాల ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా విద్యార్థులకు వివరించారు. ఆయన మరణం తెలుగు రాష్ట్ర ప్రజలకు తీరని లోటని ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.