తిరుమల శ్రీవారి సేవలో రామ్‌చరణ్ దంపతులు - Ram Charan Birthday - RAM CHARAN BIRTHDAY
🎬 Watch Now: Feature Video


Published : Mar 27, 2024, 11:49 AM IST
Ram Charan Visits Tirumala Today : సినీ నటుడు రామ్‌చరణ్ దంపతులు ఈరోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో కుమార్తె క్లీంకారతో కలిసి పాల్గొన్నారు. అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రామ్‌చరణ్ దంపతులకు పండితులు ఆశీర్వచనం అందజేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Ram Charan Birthday Today : నేడు రామ్‌చరణ్ పుట్టినరోజు కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చారు. మొదటి సారిగా క్లీంకారతో కలిసి రావడంతో ఆలయం వెలుపల రామ్‌చరణ్ దంపతులను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాసేపు ఆలయ ప్రాంగణం అంతా సందడి వాతావరణం నెలకొంది.
మంగళవారం రాత్రి శ్రీవారి దర్శనం కోసం రామ్‌చరణ్ దంపతులు తిరుమల ఫీనిక్స్ అతిధి గృహానికి చేరుకున్నారు. వారికి టీటీడీ అధికారులు, అభిమానులు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున అభిమానులు అతిథి గృహం వద్దకు చేరుకోవడంతో లోపలకు వెళ్లడానికి కొంత ఇబ్బంది పడ్డారు. టీటీడీ అధికారులు వారికి కావల్సిన సదుపాయాలను ఏర్పాటు చేశారు.