రాజ్యసభ నామినేషన్ల పరిశీలన పూర్తి - ఒకటి తిరస్కరణ - Rajya Sabha YSRCP candidates
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 5:46 PM IST
Rajya Sabha Candidates Nominations: రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి దాఖలైన నామినేషన్ల స్క్రూటినీ పూర్తైంది. ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు సీట్లకు గానూ దాఖలైన నాలుగు నామినేషన్ల స్క్రూటినిని రిటర్నింగ్ అధికారులు నిర్వహించారు. వైసీపీ తరపున దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్ధుల నామినేషన్లు సక్రమంగా ఉంటటంతో వాటిని ఆమోదించినట్టు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు దాఖలు చేసిన నామినేషన్ కు కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన పత్రం లేకపోవటంతో దాన్ని తిరస్కరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యవేక్షణలో ఈ స్క్రూటినీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇక ఏకగ్రీవమే : స్క్రూటినీలో వైసీపీ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, రఘునాథరెడ్డి, గొల్లబాబూరావు నామినేషన్లకు ఆమోదం తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 20వ తేదీ వరకూ సమయం ఉండటంతో ఆ రోజు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్ధుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నట్టు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు.