రఘురామకృష్ణకు టికెట్ కేటాయించాలని అభిమానులు ర్యాలీ - జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు - Raghurama krishna Fans Rally - RAGHURAMA KRISHNA FANS RALLY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 26, 2024, 3:54 PM IST
Raghurama krishna Fans Took Out Rally in Jubilee Hills: రఘురామకృష్ణకు టికెట్ కేటాయించాలంటూ హైదరాబాద్‌లో ఆయన అభిమానులు ర్యాలీ చేపట్టారు. రఘురామకు టికెట్ దక్కాలని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో వారంతా పూజలు చేశారు. అనంతరం ఆలయం బయట రఘురామకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. రఘురామకు ఎంపీ సీటు దక్కకుండా సీఎం జగన్ కుతంత్రాలు చేస్తున్నారని వాళ్లు ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకను సీఎం జగన్ అడ్డుకోవాలని చూస్తున్నారని అభిమానులు పేర్కొన్నారు. రఘురామ కేవలం నర్సాపురానికి మాత్రమే పరిమితం కాలేదని ఆయన రాష్ట్రంలో ఎక్కడి నుంచి బరిలో నిలిచినా తప్పకుండా గెలుస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రఘురామకు బీజేపీలో ఎక్కడ టిక్కెట్ వస్తుందోనని జగన్ కొంతమంది ద్వారా ఆయనకు సీటు రాకుండా చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు. జగన్ చేసే అన్యాయాలు, అక్రమాలను రఘురామ ఒక్కడే అడ్డుకోగలిగిన వ్యక్తి కాబట్టి ఈ విధంగా చేశారు. జగన్ను ఏ విధంగా ఎదుర్కొవాలో ఆయనకు తెలుసు కాబట్టి అధికారంలో ఉండనివ్వకూడదని బీజేపీలో సీటు రాకుండా అడ్డుకుంటున్నారు. - కిరణ్, రఘురామకృష్ణరాజు అభిమాని