శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్న పీవీ సింధు - Pv Sindhu at Sri kalahasti Temple - PV SINDHU AT SRI KALAHASTI TEMPLE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 3:44 PM IST
PV Sindhu at Sri kalahasti Temple: తిరుపతి జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సింధు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు మంత్రోచ్ఛారణలతో సింధు, ఆమె కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికలను అందించి శేష వస్త్రాలతో సత్కరించారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న సింధు హుండీలో కానుకలు సమర్పించి మెుక్కులు చెల్లించుకున్నారు.
PV Sindhu Asia Championships 2024: ఇటీవల ప్రతిష్ఠాత్మకమైన 2024 ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. 1 గంట 9 నిమిషాలపాటు సాగిన ఆటలో సింధు పోరాడినప్పటికీ మూడో సెట్లో చైనా ప్లేయర్‌దే పైచేయి అయ్యింది.