ప్రజలకు ఏమీ చేయలేకపోయా - వైఎస్సార్సీపీకి పుట్టపర్తి కౌన్సిలర్ లక్ష్మీపతి రాజీనామా - Councillor Resign to YSRCP - COUNCILLOR RESIGN TO YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 3:10 PM IST
Puttaparthi Councillor Resign to YSRCP: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ పాలనతో విసుగు చెందిన ప్రజలు రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నారు. తాజాగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ ఏడో వార్డు కౌన్సిలర్ లక్ష్మీపతి వైఎస్సార్సీపీ సభ్యత్వానికి (YSRCP Membership) రాజీనామా చేశారు. కౌన్సిలర్‌గా గెలిచినా ప్రజలకు ఎటువంటి సేవ చేయలేక పోయానంటూ లక్ష్మీపతి ఆవేదన వ్యక్తం చేశారు.
No development under YSRCP Ruling: రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, బాబు అధికారంలోకి రావాలని లక్ష్మీపతి తెలిపారు. గతంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరానని, కౌన్సిలర్‌గా గెలిచినా ప్రజలకు ఏమి చేయలేకపోయానని వైఎస్సార్సీపీ (YSRCP) పాలనలో అభివృద్ధి శూన్యమని లక్ష్మీపతి స్పష్టం చేశారు. శనివారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి (Former Minister Raghunadh Reddy) సమక్షంలో టీడీపీలో (TDP) చేరుతున్నట్టు కౌన్సిలర్ లక్ష్మీపతి తెలిపారు. 13వ తేదీన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున రావాలని లక్ష్మీపతి కోరారు.