నిమ్మకూరులో బీజేపీ 'పల్లెకు పోదాం', పాల్గొన్న పురందేశ్వరి - బీజేపీ పల్లెకు పోదాం కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 3:37 PM IST
|Updated : Feb 10, 2024, 4:39 PM IST
Purandeshwari in Gram Gram ke Chalo in Vijayawada : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో పర్యటించారు. పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా నిమ్మకూరు చేరుకున్న పురందేశ్వరికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పురందేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ్ గ్రామ్‌కే ఛలో కార్యక్రమం ద్వారా కోసూరు, కాజా గ్రామాల్లో ఆమె పర్యటించనున్నారు. కాజాలో పార్టీ శ్రేణులతో పురందేశ్వరి సమావేశం నిర్వహించనున్నారు.
BJP Gram Gram ke Chalo in Andhra Pradesh : ఇరవై ఒక్క వేల గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని శుక్రవారం మీడియా సమావేశంలో పురందేశ్వరి తెలిపారు. బీజేపీని సంస్థాగతంగా బలో పేతం చెయ్యడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్ధేశమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్ర, శని వారాల్లో పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.