వామ్మో! వారి మెడలో 25కిలోల బంగారం- శ్రీవారి దర్శనం క్యూలైన్లలో భక్తులు షాక్ - GOLD FAMILY IN TIRUMALA - GOLD FAMILY IN TIRUMALA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 3:43 PM IST
Pune Gold Man Family Visit in Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఓ వ్యాపారవేత్త కుటుంబసభ్యులు భారీగా బంగారు ఆభరణాలు ధరించి ఆలయానికి వచ్చారు. దీంతో ఆలయంలోని భక్తులంతా ఒక్కసారిగా వాళ్లని చూసి కంగుతిన్నారు. మహరాష్ట్రలోని పూణేకు చెందిన సన్నీ నానాసాహెబ్ వాఘ్‌చౌరే అనే వ్యాపారవేత్త వారి కుటుంబ సభ్యులు దాదాపు 25 కేజీల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబసభ్యుల్లో ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు రూ.15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు.
ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించి సెల్ఫీలు దిగారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం. ఇటీవల హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన గోల్డ్ మాన్లు భారీగా బంగారం ధరించి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఆలయం వెలుపల ఫోటోలు తీసుకుంటూ హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.