thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 2:22 PM IST

ETV Bharat / Videos

సతీశ్‎రెడ్డితో బీటెక్ రవి భేటీ - టీడీపీలోకి ఆహ్వానం

Pulivendula TDP Candidate B tech Ravi : సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను సైతం ప్రకటించారు. దీంతో శర వేగంగా రాజకీయం సమీకరణాలు మారుతున్నాయి. ఈ  సారి ఎలాగైనా సీఎం జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని చంద్రబాబు రంగంలోకి దించారు. 

B Tech Ravi Meets EX MLC Satish Reddy : ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుకున్న బీటెక్ రవి 2019 ఎన్నికల్లో జగన్​కు ప్రత్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా నిలిచిన, మాజీ శాసన మండలి సభ్యుడు సతీష్ రెడ్డితో భేటీ అయ్యారు. వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లిలో సతీష్ రెడ్డిని కలిసి టీడీపీలోని రావాలని ఆహ్వానించారు. తన రాజకీయ భవిష్యత్తుకు సతీష్ రెడ్డి సహకారమే కారణమన్న బీటెక్ రవి, జగన్​కు వ్యతిరేకంగా కలసి పని చేద్దామని కోరినట్లు మీడియాకు వెల్లడించారు. కార్యకర్తలు, నాయకులతో చర్చించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని సతీష్ రెడ్డి చెప్పినట్లు బీటెక్ రవి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.