మత విద్వేషాలు రెచ్చగొట్టి లాభం పొందాలని చెవిరెడ్డి యత్నిస్తున్నాడు- పులివర్తి సుధారెడ్డి - Pulivarthi Sudha Reddy - PULIVARTHI SUDHA REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 8:10 PM IST
Pulivarthi Sudha Reddy Fired on CheviReddy Bhaskar Reddy: చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై మండిపడ్డారు. నామినేషన్ ప్రక్రియను శాంతియుతంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాల్సి ఉండగా కార్యకర్తల మధ్య ప్రజల మధ్య చిచ్చులు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి స్వలాభం పొందాలని ప్రయత్నిస్తున్నారని సుధారెడ్డి ఆరోపించారు. నామినేషన్ రోజు కార్యకర్తల మధ్య గొడవలు పెట్టిన వారే క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు.
గంజాయి మత్తులో చిన్న బిడ్డను చిదిమేసిన మానవ మృగాలపై క్యాండిల్ ర్యాలీ ఎందుకు చేయలేదని, స్కూల్ విద్యార్థినికి గంజాయి అలవాటు చేస్తే క్యాండిల్ ర్యాలీ గుర్తు రాలేదా, వైఎస్సార్సీపీ నాయకులు తీసిన ఇసుక గోతిలో పడి ఓ విద్యార్థి మృతి చెందితే నో క్యాండిల్ ర్యాలీ అని చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి జిల్లా సుధారెడ్డి స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 10 రోజులు నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో టీడీపీ చేరడం చూసి ఓర్వలేక దాడుల కుట్రకు చెవిరెడ్డి తెరలేపారని సుధారెడ్డి ఆరోపించారు.