ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు - 'అనంత బాబు గో బ్యాక్' అంటూ యువత నినాదాలు - Protest To YSRCP MLC Anantha Babu
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 7, 2024, 12:26 PM IST
Protest To YSRCP MLC Anantha Babu : అల్లూరి జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు అడుగుడుగునా నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. తమ గ్రామాల్లోకి అనంతబాబు అడుగుపెట్టొద్దంటూ యువత హెచ్చరిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూనవరం మండలం కుటూరు గ్రామ పర్యటన వెళ్లిన అనంత బాబు, ఆయన అనుచరులను గ్రామస్థులు, యువత అడ్డుకున్నారు. 'అనంత బాబు గో బ్యాక్ (Go Back Anantha Babu)' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో గిరిజనులకు అన్యాయం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని యువకులు నిలదీశారు. పోలవరం నిర్వాసితులుగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంత బాబు తక్షణమే గ్రామం విడిచి వెళ్లిపోవాలని నినదించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల గిరిజన యువకులను అక్కడి నుంచి నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. గాయపడిన యువకులు కోతులగుట్ట ప్రభుత్వ వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వైపు ఉండాల్సిన పోలీసులు ప్రశ్నించిన యువతపై దాడి చేయడం ఏంటని స్థానిక నాయకులు, యువకులు ఆవేదన వ్యక్తం చేశారు.