LIVE : నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము - President Murmu live - PRESIDENT MURMU LIVE
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2024, 11:38 AM IST
|Updated : Sep 28, 2024, 1:43 PM IST
President Droupadi Murmu Attend Convocation of Nalsar Law University : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలో జస్టిస్ సిటీలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి పర్యటనలో మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్క ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, నల్సార్ వైఎస్ ఛాన్స్‌లర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.వాసంతి, నల్సార్ యూనివర్సిటీ ఉపకులపతి క్రిష్ణదేవరావ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దాదాపు 57 బంగారు పతకాలను రాష్ట్రపతి అందిస్తున్నారు. పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ, పీజీ డిప్లోమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉత్తీర్ణులైన 592 మంది పట్టభద్రులకు రాష్ట్రపతి పట్టాలు ప్రధానోత్సవం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి బొల్లారం వెళ్లనున్నారు.
Last Updated : Sep 28, 2024, 1:43 PM IST