జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యానికి బాధ్యులెవరు ?
🎬 Watch Now: Feature Video
Pratidwani: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో ఇంత సుదీర్ఘ జాప్యం జరగడానికి బాధ్యులెవరు ? రోజు వారీ విచారణ జరుగుతున్నట్లు చెబుతున్నా ఇంతవరకూ ఎలాంటి పురోగతి ఎందుకు కనిపించలేదు ? ఇవి సుప్రీంకోర్టు సీబీఐకి, జగన్ తరపు న్యాయవాదులకు వేసిన సూటి ప్రశ్నలు. 43వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ 11 ఛార్జిషీట్లు వేసి పుష్కరకాలమైంది. గత 12 ఏళ్లుగా ఆ కేసుల్లో 3వేలకు పైగా వాయిదాలు కోరారు జగన్మోహన్ రెడ్డి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు వేసి పన్నెండేళ్లు అవుతోంది. ఇంతవరకు ఆ కేసులు ఎందుకని ఎటూ తేలకుండా ఉన్నాయి ? చట్టం అందరికీ సమానమే అంటారు కదా ? మరి ఈ వీవీఐపీ కేసులు ఎందుకు తెమలట్లేదు? ఆ కేసుల్లో పురోగతి లేకపోవటంపై సుప్రీంకోర్టు కూడా అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ? వైసీపీ వాళ్లు చాలా సింపుల్‌గా జగన్ మీద టీడీపీ, కాంగ్రెస్ కుట్ర చేసి తప్పుడు కేసుల్లో ఇరికించాయని చెబుతూంటారు. అలాంటప్పుడు కేసుల్లో జగన్ వాయిదాలు కోరకుండా త్వరగా న్యాయపరీక్షకు నిలవచ్చు కదా ? ఇదీ నేటి ప్రతిధ్వని.