శంఖారావం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం: పత్తిపాటి పుల్లారావు - Prathipati Foundation Free Eye Camp
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 11, 2024, 5:44 PM IST
Prathipati Foundation Free Eye Camp: నవశకం నినాదాన్ని సాకారం చేసే దిశగా శంఖారావం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని మాజీమంత్రి టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. దుర్మార్గపు ఆలోచనలతో జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడని అన్నారు. వరస కార్యక్రమాలతో లోకేశ్ ప్రజలకు చేరువ అవుతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 34వ ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరై ఆయన మట్లాడారు. నియోజకవర్గ ప్రజల కోసం తమ ఫౌండేషన్ ద్వారా ఉచితవైద్య శిబిరాలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఉచిత కంటి పరీక్షలతో పేదలకు ఎంతో సాంత్వన చేకూరుతోందని తెలిపారు. కంటి శస్త్రచికిత్సలు అందించడంలో శంకర్ కంటి ఆస్పత్రి దేశంలోనే ప్రథమస్థానంలో ఉందని కొనియాడారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇప్పటివరకు 34 ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 18న విజయవాడ సెంటినీ ఆస్పత్రి సౌజన్యంతో మరో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.