'కలలకు రెక్కలు' పథకానికి అనూహ్య స్పందన- 11,738 మంది యువత దరఖాస్తు
🎬 Watch Now: Feature Video
Positive Response to Kalalaku Rekkalu Scheme: మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రకటించిన ‘కలలకు రెక్కలు’ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. 11 వేల 738 మంది యువతులు తమ పేరు, వివరాల్ని సంబంధిత వెబ్సైట్లో (Website) నమోదు (Enrollment)చేసుకున్నారు.
Bhuvaneswari Scheme for Higher Education of Girl Students: ఏ విద్యార్థిని తన చదువును మధ్యలోనే ఆపకూడదనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి (TDP, Janasena, BJP Alliance) ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఈ పథకంలో భాగంగా ఇంటర్ తర్వాత పైచదువులకు తీసుకొనే బ్యాంకు రుణాలకు ప్రభుత్వం హామీగా ఉంటుంది. కోర్సు కాలానికి అయ్యే వడ్డీని ప్రభుత్వమే (interest will deposit by gov) భరిస్తుంది. దేశంలో ఎక్కడ చదివినా ఈ పథకం వర్తిస్తుందని భువనేశ్వరి తెలిపారు.