లాడ్జిలో పోలీసుల తనిఖీలు - 4 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం - Gold Jewellery seize - GOLD JEWELLERY SEIZE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 2, 2024, 6:50 PM IST
Police Seized Gold Jewellery From Lodge In Bobbili : విజయనగరం జిల్లా బొబ్బిలిలో పోలీసులు నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సూర్య రెసిడెన్సీ లాడ్జిలో తనిఖీలు నిర్వహించగా బంగారం పట్టుబడింది. బంగారు ఆభరణాలకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రహస్యంగా రెండు బాక్సుల్లో తీసుకెళ్తున్న ఉంగరాలు, హారాలు, లాకెట్స్ తదితర 18 రకాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు సుమారు నాలుగు కిలోలు ఉంటుందని తెలిపారు. పన్ను ఎగవేతలో భాగంగా ఆభరణాలను రహస్యంగా విజయనగరం జిల్లాలోని పలు దుకాణాలకు తరలించేందుకు వీరు సిద్ధపడుతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. బంగారానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకునట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. జీఎస్టీ అధికారులు వచ్చి వాటికి అపరాధ రుసుము విధిస్తారని డీఎస్పీ తెలిపారు. వాళ్లతోపాటు సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.