ఏపీఎండీసీ కార్యాలయం వద్ద పోలీసు భద్రత పెంపు- వైఎస్సార్సీపీ హయాంలో భారీగా అక్రమాలు! - Police Security at APMDC - POLICE SECURITY AT APMDC
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 7:17 PM IST
Police Security at APMDC Office : ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం వద్ద పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు బయటకు తీసుకెళ్లకుండా పోలీసులను కాపలా ఉంచారు. ఏపీఎండీసీ(APMDC) మాజీ ఎండీ వెంకటరెడ్డిపై పలు అభియోగాలు రావడంతో కొత్త ప్రభుత్వంలో ఆయనను బదిలీ చేశారు. ఏపీఎండీసీ సంస్థ నూతన ఎండీగా ఐఏఎస్ అధికారి యువరాజ్ బాధ్యతలు స్వీకరించారు. వెంకటరెడ్డి ఏపీ నుంచి రిలీవ్ అయ్యేందుకు ప్రయత్నించగా కొత్త ప్రభుత్వం తిరస్కరించింది.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విభాగం గనుల శాఖే. ఇసుక, బొగ్గు, బీచ్‌శాండ్, ఇతర ఖనిజాల వేలం, టెండర్లు, అమ్మకం ప్రక్రియలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఆ అక్రమాలకు గనుల శాఖ ఉన్నతాధికారులే కొమ్ముకాశారనే విమర్శలున్నాయి. ఇసుక తవ్వకాల్లో అక్రమాలే జరగలేదంటూ ఎన్జీటీ, హైకోర్టును సైతం గనులశాఖ అధికారులు తప్పుదోవ పట్టించారు. ఇదంతా వైఎస్సార్సీపీ ముఖ్యనేత ఆదేశాల మేరకే జరిగిందన్నది బహిరంగ రహస్యం.