ఫైళ్ల దహనం ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు- నిందితులు వీరే! - Document Burning in Vijayawada - DOCUMENT BURNING IN VIJAYAWADA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 11:27 AM IST

Police Registered Case Issue of Document Burning in Vijayawada : కృష్ణా కరకట్టపై పీసీబీ (PCB) ఫైళ్ల దహనం ఘటనకు సంబంధించి న్యాయ సలహా మేరకు పెనమలూరు పోలీసులు సెక్షన్లు మార్చి ఎఫ్​ఐఆర్​ (FIR) నమోదు చేశారు. మొదట బీఎన్​ఎస్​ఎస్​ (BNSS-Bharatiya Nagarik Suraksha Sanhita)లోని 106 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత భారతీయ న్యాయ సంహితలోని 324, 316, 238 సెక్షన్లతో ఎఫ్​ఐఆర్​ రిజిస్టర్‌ చేశారు. డ్రైవర్‌ నాగరాజు, అటెండర్‌ రూపేంద్ర, సమీర్‌ శర్మ ఓఎస్​డీ రామారావును నిందితులుగా చేర్చారు. స్వాధీనం చేసుకున్న దస్త్రాల నమోదు ప్రక్రియ పూర్తి చేశారు.

ఓఎస్డీ రామారావు చెప్పిన మీదటే తాము దహనం చేశామని డ్రైవర్, అటెండర్లు పోలీసులకు విచారణలో వెల్లడించారు. తర్వాత రామారావుకు నోటీసు ఇచ్చి విచారణకు పిలవనున్నట్లు సమాచారం. కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులను పిలిపించి వారితో దస్త్రాలను పరిశీలన చేయించనున్నారు. అధికారుల పరిశీలనలో వచ్చిన వివరాల ఆధారంగా ముందుకు సాగాలని పోలీసులు భావిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.